చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో జరిగిన పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. జగనన్న గోరుముద్దలు, నాణ్యమైన పాలు, చక్కీలు వంటివి పిల్లలకు నిరంతరంగా అందించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. Gas leak: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో గ్యాస్ లీక్