ETV Bharat / state

వలస కూలీల కళ్లలో... నవ వసంతం

లాక్​డౌన్ నేపథ్యంలో వలసకూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడానికి పడే పాట్లు అంతా ఇంతా కావు. కాళ్లకు రక్తాలొచ్చేలా నడిచినా.. చివరికి సొంతగూటికి చేరకుండానే చనిపోతున్న వారెందరో. ఆకలి కేకలు, ఆర్తనాదాలతో వారు బతుకీడిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. వేలాదిమందిని వారి రాష్ట్రాలకు పంపించేలా ఏర్పాట్లు చేసింది.

author img

By

Published : May 17, 2020, 9:03 AM IST

Migrant laborers going to their states  by shramik train in ongole
శ్రామిక్ రైలులో మధ్యప్రదేశ్‌ వలసకూలీలు
శ్రామిక్ రైలులో మధ్యప్రదేశ్‌ వలసకూలీలు

ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్‌ నుంచి వలస కార్మికుల తరలింపును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 7 జిల్లాలకు చెందిన కార్మికులను ప్రత్యేక బస్సుల్లో తీసుకువచ్చి... ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి తరలించారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో చిక్కుకున్న వలస కూలీలను.. శ్రామిక్‌ రైలు ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన సుమారు 3,200 మంది కార్మికులు ఆయా జిల్లాల్లో వివిధ వృత్తుల్లో వున్నారు. వారి అభ్యర్థనలు మేరకు వీరిని సొంత రాష్ట్రాలకు పంపించేందకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ఉన్నా వారిని ప్రత్యేక బస్సుల్లో ఒంగోలుకు రప్పించి, ఇక్కడ నుంచి ప్రత్యేక రైలులో వారిని తరలిస్తున్నారు. టిక్కెట్లు కూడా ప్రభుత్వమే చెల్లించి పంపిస్తోంది.

వైద్య పరీక్షలు నిర్వహించి, శానిటైజర్లు, మాస్క్‌లు, భోజనం, మంచినీళ్లు అందించి మరీ.. వలస కార్మికులను రైలు ఎక్కిస్తున్నారు. తమ అభ్యర్థనలు మన్నించి సొంత రాష్ట్రానికి పంపింస్తుండటం ఆనందంగా ఉందని కార్మికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి:

ఉమ్మెత్త విత్తనాలు తిన్నారు..ఆస్పత్రి పాలయ్యారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.