ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఒకవైపు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికితోడు ఇలాంటి ఘటనతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కుంకుమ, పసుపు, కోడిగుడ్లు తదితర వస్తువులు కనబడటంతో ఎక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని చెబుతున్నారు.
ఇవీ చదవండి