లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని మెడికల్ షాపు యజమానులతో స్థానిక ఎస్సై శివకుమార్ సమావేశం నిర్వహించారు. ఔషధాలు అధిక ధరలకు అమ్మ వద్దని, స్లిప్పు ఉంటేనే మందులు ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా తీవ్రమైన జలుబు, దగ్గుతో షాపుకు వస్తే తమకు తెలియపరచాలని ఎస్సై దుకాణ యజమానులకు సూచించారు. ఎవరైనా ఆర్ఎంపీలు మందలు కొనుగోలు చేసిన తెలియపరచాలన్నారు. మందలు ఎవరికి అమ్ముతున్నారో రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని కోరారు. నిబంధనలు పాటించని ఔషద దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మార్టూరు ఎస్సై శివ కుమార్ హెచ్చరించారు.
ఇదీ చదవండి :