ETV Bharat / state

మార్కాపురం సబ్ కలెక్టర్​కు తృటిలో తప్పిన ప్రాణాపాయం..

author img

By

Published : Jan 28, 2023, 11:37 AM IST

Road Accident: మార్కాపురం సబ్ కలెక్టర్ తృటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆయన వాహనాన్ని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

Road Accident
Road Accident

Road Accident: మార్కాపురం సబ్ కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనాన్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మర్రి చెట్లు పాలెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళుతున్న సబ్ కలెక్టర్ సేతు మాధవ్ వాహనాన్ని క్వారీలకు చెందిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సబ్ కలెక్టర్ సేతు మాధవకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ మరో ఇద్దరు ఈ కారులో ఉన్నారు . వీరందరికీ గాయాలు కావడంతో చీమకుర్తి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.