మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే(Maoist leader rk) సంస్మరణ సభను ప్రకాశం జిల్లా(Prakasam district) టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభకు చుట్టుపక్కల నుంచి అనేకమంది తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు అరుణోదయ విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్కే తనయుడు పృథ్వి అలియాస్ మున్నా ఐదవ వర్ధంతి కూడా నేడే.
ఆర్కే సంస్మరణ సభకు వస్తున్న పలువురు పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఇది చాలా దారుణమని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఆర్కే గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు. ఆర్కే మృతిని స్మరించుకుంటూ పాటలు పాడారు.
ఇదీ చదవండి