ETV Bharat / state

"మనబడి నాడు-నేడు"కు ఇవాళ సీఎం జగన్ శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మనబడి నాడు- నేడు కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది. బాలల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

manabadi naadu nedu
author img

By

Published : Nov 14, 2019, 4:46 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు స్కూళ్లకు కొత్తరూపు తెచ్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల బడుల్లో తొలిదశలో 15వేల 715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు దీనిని అమలుచేస్తున్నారు. ఇందులో 9వేల795 ప్రాథమిక, 3వేల 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2వేల810 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ఈ కార్యక్రమం కింద పాఠశాలలో 9 రకాల పనులు చేపట్టనున్నారు. అవి

1. నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు
2. విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు
3. తాగునీటి సదుపాయం
4. విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్
5. పాఠశాలలకు రంగులు
6. మరమ్మతులు
7. గ్రీన్ చాక్ బోర్డులు
8. అదనపు తరగతి గదులు
9. ప్రహరీ నిర్మాణం

సీఎం చేతుల మీదుగా ప్రారంభం
దీర్ఘకాలిక ప్రణాళికతో అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యే విధంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.