ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ నిబంధన కొనసాగుతోంది. పట్టణ ప్రజలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు. ఉదయం 6 గంటలనుంచి 11గంటలవరకు నిత్యావసరాలు కొనుగోలు చేయవచ్చన్న అధికారుల ప్రకటనతో కూరగాయలు, నిత్యావసర దుకాణాలు రద్దీగా మారుతున్నాయి. చాలాచోట్ల ప్రజలు సామాజిక దూరం పాటిస్తుండగా కొన్నిచోట్ల గుంపులుగా ఉంటున్నారు. చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో పట్టణంలోని అంతర్గత వీధుల్లో ముళ్ళకంచెలు అడ్డుగా వేసి 'ఎవరూ మావీధికి రావద్దు... మేము బయటకు రాము' అంటూ బోర్డులు పెట్టారు.
ఇదీ చదవండి.