ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్ - undefined

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలతో ఇళ్లకే పరిమితమయ్యారు.

Lock Down in Prakasham Dist
ప్రకాశం జిల్లాలో కొనసాగుతోన్న లాక్ డౌన్
author img

By

Published : Mar 24, 2020, 8:40 PM IST

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్

యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజలు లాక్​డౌన్​కు మద్దతు పలికారు. ఉదయం నిత్యావసర సరకులు కొనుగోలు చేసిన తరువాత... ఇళ్లకే పరిమితమైయ్యారు. పోలీసులు ప్రధాన కూడళ్లలో తిరుగుతూ... ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

చీరాలలో లాక్​డౌన్​తో రహదారులు బోసిపోయాయి. రహదారులపైకి వచ్చినవారికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నెహ్రూ కూరగాయల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి కూరగాయల మార్కెట్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

గిద్దలూరులో పూర్తిగా లాక్​డౌన్ చేసినట్లు సీఐ సుధాకర్ రావు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. రేపటి నుంచి 144 సెక్షన్ పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు వివరించారు. అవసరం లేకుండా ద్విచక్రవాహనాలపై తిరిగితే బైక్​లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

చిన్నగంజాంలో శానిటైజర్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కడవకుదురు వద్ద వ్యవసాయ కూలీలు వెళుతున్న ఆటోను ఆపి వారిని దించేశారు. చేతులెత్తి నమస్కరిస్తూ ఇంటికి వెళ్లండి... కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొండి అంటూ... సీఐ రాంబాబు రెండు చేతులు జోడించి చెప్పారు. జాతీయ రహదారిపై చెక్​పోస్టు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఇదీ చదవండి: మార్కాపురంలో కొనసాగుతున్న లాక్​డౌన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.