ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతినిస్తున్నారు. పుల్లలచెరువు, ఎన్టీఆర్ కూడలి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా నియంత్రిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు