ప్రకాశం జిల్లాలో రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకే నిత్యావసర సరుకులు కొనుక్కోవటానికి అధికారులకు అనుమతినిచ్చారు. ఆ తరువాత జనాలను రోడ్లపై తిరగనివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 38కేసులు నమోదవటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అధికారులు ప్రకటించిన 9 రెడ్‌జోన్ ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి రాకపోకలకు వీలు లేకుండా చేశారు. లాక్‌డౌన్‌తో నిరాశ్రయులు, పేదలకు స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి.
ఇదీ చదవండి: