ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లటంతో మద్యం ప్రియులు దగ్గరలో ఉన్న బొద్దికూరపాడు గ్రామంలోని మద్యం దుకాణానికి వెళ్ళటం మొదలుపెట్టారు. పరిస్థితిని గమనించిన మహిళలు మద్యం దుకాణం మాసెయాల్సిందేనని ఆందోళనకు దిగారు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించి షాపు తీయడానికి ప్రయత్నించగా... షాపు ముందు నిప్పు పెట్టారు. కనీసం కరోనా తగ్గేవరకు అయినా మద్యం దుకాణం మూసివేయాలని మహిళలు కోరుతున్నారు.
ఇదీ చూడండి