కరోనా సోకి కోలుకున్నా.. తర్వాత తలెత్తిన అనారోగ్యంతో జవాను మృతి చెందడం ప్రకాశం జిల్లా చిన్న కంభంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన శెట్లం శ్రీపతి సైన్యంలో జేసీవో ర్యాంకు హోదాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీపతి నెలరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. నెగెటివ్ వచ్చిన తర్వాత న్యూమోనియా సోకింది. శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 21న మృతి చెందారు. జవాన్ మృతదేహాన్ని హైదరాబాద్ వరకు విమానంలో తీసుకువచ్చి.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాతికేళ్లుగా దేశసేవ చేసిన జవాను ఇలా అనారోగ్యంతో మరణించడం కుటుంబసభ్యులతో పాటు గ్రామంలోనూ విషాదం నింపింది.
ఇవీ చదవండి..