ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 'జగనన్న తోడు' గుర్తింపు కార్డులు జారీ - యర్రగొండపాలెంలో జగనన్న తోడు కార్యక్రమం వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు జగనన్న తోడు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. చిరు వ్యాపారులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారని వైకాపా నేతలు అన్నారు.

jaganna thodu program
యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు 'జగనన్న తోడు' గుర్తింపు కార్డులు జారీ
author img

By

Published : Nov 25, 2020, 8:53 PM IST

చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన జగన్న తోడు పథకాన్ని.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వైకాపా నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా మంది చిరు వ్యాపారులు పెట్టుబడుల కోసం వడ్డీకి అప్పులు తెచ్చి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అటువంటి వారిని ఆదుకోవడానికే జగన్న తోడు పథకం ప్రవేశపెట్టారన్నారు. అనంతరం లబ్ధిదారులకు జగన్న తోడు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లాలో

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలు మెచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించి.. రుణాలు మంజూరైన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి.. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గుంటూరు జిల్లాలో

చిరు వ్యాపారులు వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కష్టాలు పడుతున్నారని.. వారి బాధలు తీర్చడానికే సీఎం జగన్ 'జగనన్న తోడు' పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రోడ్డు పక్కన రోజు వారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

విజయనగరం జిల్లాలో

విజయనగరం జిల్లా సాలూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలో చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు సీఎం జగన్ 'జగనన్న తోడు' పథకం ప్రారంభించారని ఎమ్మెల్యే పీడిక దొర అన్నారు. వారి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. పట్టణంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో

చిరు వ్యాపారులు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకంతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆర్డీవో శీనా నాయక్​తో కలిసి చిరు వ్యాపారులకు చెక్కులు పంపిణీ చేశారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధి 11 మండలాల్లో 1049 మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మంజూరు అయ్యాయన్నారు.

ఇవీ చదవండి..

'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.