ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి చిలకలేరు వాగులో.. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని పోలీసులు, ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు ఎస్పీ రాజేంద్ర నేతృత్వంలో దాడులు చేశారు.
ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకోగా, జేసీబీ డ్రైవర్ పరారయ్యాడు. 2 జేసీబీలు, 6 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అద్దంకి ఎస్సై మహేష్ తెలిపారు.
ఇదీ చదవండి: