లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో అధికారులు ఇళ్ల పట్టాల కోసం నేల చదును చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలు వీధిల్లోకి వస్తే ఊరుకునేది లేదని హుకుం జారి చేసిన అధికారులే కూలీలతో పనులు చేయిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తి వేసిన వెంటనే ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించటంతో స్థలాలు చదును చేసే పనులు ముమ్మరం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో అధికారులు పనులు చేపడుతున్నారు. ఎస్‌ఎన్‌పాడు మండలం ఎండ్లూరు సమీపంలో రోజూ మధ్యాహ్నం వరకూ కూలీలతో పనులు చేయిస్తుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, మీడియా ప్రతినిధులు అటుగా వెళ్తే కూలీలను పక్కనే ఉన్న తోటల్లోకి తరలించి దాచిపెడుతున్నారు. లాక్డౌన్ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులే ఇలా పనులు చేయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు చేసే పనులకు లాక్డౌన్ వర్తించదా?
ఒక వైపు కరోనా కారణంగా లాక్డౌన్ అమలు చేస్తున్న అధికారులే మరో వైపు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఎవరైన బయటకి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారి చేసిన అధికారులే కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఎవరైన ఆ ప్రాంతానికి వెళ్తే కూలీలను పక్కనే ఉన్న తోటల్లో దాచిపెడుతున్నారు. కరోనా నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులే ఇలా పనులు చేయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో అధికారులు ఇళ్ల పట్టాల కోసం నేల చదును చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలు వీధిల్లోకి వస్తే ఊరుకునేది లేదని హుకుం జారి చేసిన అధికారులే కూలీలతో పనులు చేయిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తి వేసిన వెంటనే ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించటంతో స్థలాలు చదును చేసే పనులు ముమ్మరం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో అధికారులు పనులు చేపడుతున్నారు. ఎస్‌ఎన్‌పాడు మండలం ఎండ్లూరు సమీపంలో రోజూ మధ్యాహ్నం వరకూ కూలీలతో పనులు చేయిస్తుండటంపై పలువురు విమర్శిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, మీడియా ప్రతినిధులు అటుగా వెళ్తే కూలీలను పక్కనే ఉన్న తోటల్లోకి తరలించి దాచిపెడుతున్నారు. లాక్డౌన్ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులే ఇలా పనులు చేయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: బాధ్యతారాహిత్యం.... మాంసం కోసం గుమిగూడిన జనం