ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. ప్రసిద్ధి చెందిన కంభం చెరువులో నీటి మట్టం పెరిగింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వానలకు గండ్లకమ్మ, ఝంపలేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహించి భారీగా వరద చేరుకుంటోంది.
గత 5 సంవత్సరాలుగా నీరు లేక వట్టిపోయిన చెరువు... ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం చెరువులో నీరు 18 అడుగులకు చేరుకుంది. మరోవైపు.. స్థానికులు వరద రాజమ్మకు, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:
ముగ్ధ మనోహరం: మూసీ మురిపిస్తోంది.. కృష్ణా కనువిందు చేస్తోంది..