ETV Bharat / state

మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ... లొంగిపోయిన నిందితుడు - lady murder

సంచలనం రేపిన మహిళ హత్య కేసులో నిందితుడిని ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు. చీరాల ముత్యాలపేటలోని బోస్​నగర్​లో నివసించే తోట కాత్యాయని (55) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

HATYA_KESU_LO_NINDITUDU_ARREST
మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
author img

By

Published : Jul 15, 2021, 12:28 PM IST

కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్లాడు. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసి ఆమెపై ఉన్న బంగారాన్ని లాక్కున్నాడు. ఆమె కేకలు వేయడంతో వైర్లు కత్తిరించే చాకుతో కిరాతకంగా గొంతు కోసి హత్యచేసి బంగారంతో పరారయ్యాడు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ముత్యాలపేటలో సంచలనం రేపిన మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా రామకృష్ణాపురనికి చెందిన కె.రాఘవేంద్రరావు అనే వ్యక్తి హత్యచేసినట్లుగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు... అతనికోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టాయి. పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు స్వయంగా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నిందితుడి నుంచి హతురాలి తాళి బొట్టు, గాజులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇది చదవండి :

international flights: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.