Funeral of dog: ప్రకాశం జిల్లా అద్దంకిలో ఓ కుటుంబం.. తమ పెంపుడు కుక్క చనిపోయిందని తల్లడిల్లింది... కన్నీటి పర్యంతమైంది. రామ్ నగర్‌కు చెందిన అడుసుమల్లి కిషోర్ బాబు కుటుంబం.. జర్మన్ షెపర్డ్ జాతి శునకాన్ని ఎంతో ఇష్టంగా బెంగళూరులో కొనుగోలు చేశారు. సన్నీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పన్నెండేళ్లుగా కుటుంబ సభ్యులలో ఒకరిగా దాన్ని చూసుకున్నారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న శునకం కన్నుమూసింది. దీంతో.. తమ సన్నీ ఇక రాదని తెలిసి ఆ కుటుంబం గుండెలవిసేలా రోదించింది. డప్పు చప్పుళ్లతో ఆ కాలభైరవుడి మృతదేహానికి ఊరేగింపు చేశారు. శ్మశాన వాటికలో వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేశారు.
ఇదీ చదవండి: Viveka Murder Case: "వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసు"