ప్రకాశం జిల్లాలో నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 12 మండలాల్లోని 168 పంచాయతీలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
మార్కాపురం డివిజన్ వ్యాప్తంగా నాలుగవ విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
గిద్దలూరు మండలంలోని పలు పంచాయతీలలో నాలుగవ దశ ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద బారులు తీరారు. అధికారులు ఓటర్ల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ బూతుల వద్ద ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: గెలిపిస్తే ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ