ప్రకాశం జిల్లాలో తొలివిడత 227 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో.. స్వతంత్రంగా పోటీ చేసిన ఆరుగురు గెలుపొందారు. పలు చోట్లు ఘర్షణలు చోటు చేసుకోగా.. కొన్ని చోట్లు సర్పంచ్ పదవిని పంచుకొని రాజీ పడ్డారు. చీమకుర్తి మండలం నిప్పట్ల పాడు పంచాయితీలో లెక్కింపు ఉత్కంఠంగా సాగింది.
ఇక్కడ ఓ అభ్యర్థి 3 ఓట్లతేడాతో గెలవగా.. అధికార పార్టీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ లెక్కపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు.. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు లభించాయి. చివరికి.. ఎన్నికల అధికారులు బొమ్మా బొరుసు వేసి విజేతను ప్రకటించారు. కోటేశ్వరరావు విజయం సాధించారు.
ఇవీ చూడండి: