ETV Bharat / state

ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అండదండలతో మార్కాపురంలో భారీగా భూ ఆక్రమణలు: వైసీపీ బహిష్కృత నేత

Exiled YSRCP Leader On Markapuram Land Encroachment: భూ అక్రమాలలో ప్రమేయం ఉన్న మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఆయన బంధుగణంపై కఠిన చర్యలు తీసుకోవాలని..వైఎస్సార్సీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను అవసరమైతే ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

Exiled_YSRCP_Leader_comments
Exiled_YSRCP_Leader_comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 9:17 PM IST

Updated : Nov 5, 2023, 6:24 AM IST

Exiled YSRCP Leader On Markapuram Land Encroachment: ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై.. వైఎస్సార్సీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అండదండలతో ఆయన బంధువులు ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించారని ఆరోపించారు. మార్కాపురం పరిధిలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలపై వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్రంగా దర్యాప్తు చేట్టాలని డిమాండ్ చేశారు.

Peddireddy Surya Prakash Reddy Comments: మార్కాపురం పరిధిలో జరిగిన భూ అక్రమాలపై వైసీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం ఒంగోలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అండదండలతో ఆయన బంధువులు ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించారు. మార్కాపురం పరిధిలో జరిగిన భూ అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. భూ అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి, దోషులను కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రైవేటు ఆస్తులు, ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు భూ బకాసురులుగా మారారు. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించారు. తర్లపాడు మండలంలో ఎమ్మెల్యే మేనత్త, మేనమామలు వందల ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు.'' అని ఆయన ఆరోపించారు.

YSRCP Leaders Occupied Markapuram Crematorium: 'శ్మశాన వాటికనూ వదలని వైసీపీ నేతలు'.. సబ్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు

Surya Prakash Reddy on Yarragondapalem Sub-Register: రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో మార్కాపురంలో అక్రమాలు జరిగాయని..పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా ఈ అక్రమాలలో మార్కాపురం, యర్రగొండపాలెం సబ్ రిజిస్టార్ల పాత్ర ఉందని వెల్లడించారు. మార్కాపురం పట్టణానికి చెందిన రామడుగు రమేష్.. ఓ ప్రముఖుడికి చెందిన భూమిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో యర్రగొండపాలెంలో రిజిస్టర్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై తాను ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నానని, తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.

BJP Dharna for Roads in Markapuram: రోడ్డు బాగు చేయాలంటూ.. మార్కాపురంలో బీజేపీ ధర్నా

ప్రత్యేక దర్యాప్తు బృందంలో స్థానిక అధికారులను నియమిస్తే వారిపై రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తాయి. కాబట్టి స్థానికేతరులైన అధికారులతో దర్యాప్తు జరిపించాలి. భూ అక్రమాలలో ప్రమేయం ఉన్న మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి, వారి బంధువులు, అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమాలపై అవసరమైతే నేను ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తాను.-పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ బహిష్కృత నేత

గెలిచాక ఈ ఊరు మొహం చూశారా..? ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి నిరసన సెగ..

Last Updated : Nov 5, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.