ETV Bharat / state

అర్థరాత్రి ఆకస్మిక దాడులు.. 3 వేల లీటర్ల ఊట ధ్వంసం - ప్రకాశం జిల్లా నాటుసారా స్థావరాలపే దాడులు

లాక్​డౌన్​ కారణంగా నాటుసారా, మద్యాన్ని తయారు చేయడం.. అమ్మడం లాంటివి చేయకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పెడచెవిన పెట్టిన కొందరు నాటుసారా వ్యాపారుల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

Excise Enforcement Officers Attack on  Natusara manufacturing areas at musigavagu in prakasham district

author img

By

Published : Apr 2, 2020, 1:45 PM IST

అర్థరాత్రి ఆకస్మిక దాడులు.. 3వేల లీటర్ల ఊట ధ్వసం

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మూసివాగులోని నాటుసారా తయారీ స్థావరాలపై.... ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్నారని ఈనాడు - ఈటీవీ, ఈటీవీ భారత్ ఇచ్చిన సమాచారంతో.. ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా అర్థరాత్రి దాడులు చేశారు. 3వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. బెల్లం దిమ్మలు, తయారైన నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారాకు వినియోగించే సామగ్రిని అక్కడే తగలపెట్టారు. నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేశారని.... అక్రమంగా నాటుసారా తయారుచేయడం, మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ సీఐ తిరుపతయ్య హెచ్చరించారు.

ఇదీ చదవండి:

నాటుసారా @ కంచె వెనుక కథ!

ప్రియుడే హంతకుడు.. మృతురాలిది సిక్కిం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.