ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం గ్రామంలో.. రామస్వామి అనే వ్యక్తి హత్య కేసు వివరాలను పోలీసులు వివరించారు. రామస్వామి రాత్రి గొర్లదొడ్డి వద్ద పడుకుని ఉండగా.. వరసకు బావమరిది అయిన దామా సుబ్బారావు రోకలి బండతో మొహంపై బాది చంపేసినట్టు చెప్పారు. ఆ వెంటనే లొంగిపోయినట్టు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు.
రామస్వామి.. తన అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే చంపేశానని నిందితుడు చెప్పాడన్నారు. గ్రామ పెద్దలు, వీఆర్వో కలిసి సుబ్బారావును తమకు అప్పగించినట్టు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
ఇదీ చదవండి: