రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్భంగా వైకాపా బెదిరింపులకు పాల్పడుతోందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సర్కారు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. చిన్నగంజాంలో తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా అభ్యర్థులను వైకాపా భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెద్దగంజాంలో తెదేపా అభ్యర్థి ఇంటిముందు మద్యం సీసాలను వైకాపా వాళ్లు ఉంచి పోలీసులకు చెప్పి అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైకాపాను ఎలా ఎదుర్కోవాలో కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చూడండి:
తెదేపా అభ్యర్థి ఇంట్లో అక్రమ మద్యంపై ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ