ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొన్నారు. ఒంగోలు పట్టణంలో పలు చోట్ల బాణసంచా కాల్చారు. కొవిడ్ కారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబరాలు చేసుకున్నారు. చమురు, విద్యుత్ దీపాలతో ఇళ్లను అలంకరించుకోడానికే ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగను కాలుష్యం లేకుండా చిన్న చిన్న మతాబులతో జరుపుకున్నారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు