లాక్డౌన్ కొనసాగింపులో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లింలకు అపన్నహస్తం అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో 29, 30 వార్డుల్లో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. బట్టిపొలు శంకర్ 230 ముస్లిం కుటుంబాలకు బత్తాయి పండ్లు , సేమ్యాలు, పంచదార అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డులోని వైకాపా నాయకులు శీలం శ్యామ్, షేక్ మౌలాలి, చాన్ భాషా, జాన్ భాషా పాల్గొన్నారు.
ఇవీ చూడండి... : ప్రేమపేరుతో బాలికపై సామూహిక అత్యాచారం