కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు కొంతమంది దాతలు అండగా నిలిచారు. 140 మంది పేద చేనేత కుటుంబాలకు పది రోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. మరోవైపు జీవరక్షనగర్లోని యానాదులకు చెందిన 250 కుటుంబాలకు కూరగాయలు, కందిపప్పు, పంచదార అందజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో పేదలకు సహాయాన్ని అందించినందుకు వైకాపా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ దాతలను అభినందించారు.
ఇదీ చూడండి: అన్ని శాఖల సమన్వయంతోనే కరోనాను అడ్డుకోగలం'