ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. డిపోలో 2007 నుంచి పని చేస్తున్న డ్రైవర్ ఎస్.కె. కరిముల్లా.. డిపో మేనేజర్ ఆగడాలను తట్టుకోలేక అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గుర్తించిన తోటి ఉద్యోగులు స్పందించి బాదితుడిపై నీళ్లు చల్లారు.
డిపో మేనేజర్ మానసికంగా వేధిస్తున్నారని.. అదనంగా డ్యూటీలు వేస్తున్నారని విధులు సక్రమంగా నిర్వహించినా.. ఏదో సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పాడు. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కరీముల్లా తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: