అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా.. ప్రకాశం జిల్లా చీరాలలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సీతారామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవాలయ ప్రాంగణంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దీపోత్సవం నిర్వహించారు. రామ భక్తులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీపాలు వెలిగించారు.
ఇదీ చదవండి: