ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యానికి బానిసలైన వారు శానిటైజర్లు సేవించడం బాధాకరమని ఏపీ మధ్య విమోజన ప్రచార కమిటిీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒంగోలులో అన్నారు. కురిచేడు సంఘనటలో మృతి చెందినవారు నాటు సారా తీసుకున్నట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవని ఆయన పేర్కొన్నారు. మద్యానికి బానిసలైన వారిని సాధారణ మనుషులగా మార్చేందుకు.... డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వైద్యులు, కౌన్సిలర్ల పర్యవేక్షణలో ఈ కేంద్రాలు పనిచేస్తాయని ఆయన అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 15 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, రూ.4.98కోట్లు వీటికోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మద్యం, మాదకద్రవ్య వ్యసనాల నుంచి బయటపడటానికి ఇది పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి. సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళం