పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు. ప్రధాన రహదారుల్లో ఆటోకి తాళ్ళు కట్టి లాగుతూ ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా భూతంతో అల్లాడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నానాటికి ఇంధన ధరలు పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో మోటార్ వాహనాలు నడపలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలుజిల్లాలో...
పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాన్ని తాళ్లు కట్టి లాగి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: