ETV Bharat / state

రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆందోళన - చీరాలలో వామపక్షాల ఆందోళన

రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. లాభాల్లో ఉన్న రైల్వేను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తులన్నింటిని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ఆరోపించారు.

cpi cpm parties protest against railway privatization in chirala prakasam district
చీరాలలో వామపక్షాల ఆందోళన
author img

By

Published : Jul 12, 2020, 12:01 PM IST

ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం ఆలోచన దారుణమని వామపక్ష నాయకులు విమర్శించారు. రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

సీపీఎం ఏరియా కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లో పెట్టే ఆలోచనలు చేస్తోందని ఆరోపించారు. కరోనాను అవకాశంగా తీసుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న రైల్వేను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చౌకీదార్​గా ఉంటానని చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పుడు చోరీదార్​గా మారారని విమర్శించారు.

ఇవీ చదవండి..

సచివాలయం భవనం పైనుంచి పడి యువకుడి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.