ETV Bharat / state

యువకుడిపై దాడి ఘటన.. మార్కాపురం ఎస్సై, సీఐలపై కేసు నమోదు - Top Telugu News

case registered against SI and CI: ప్రకాశం జిల్లా తుర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లిలో ఎస్సై విచక్షణారహితంగా దాడి చేశారని... న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సీఐ రాజీ చేసుకోకుంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓయువకుడు మార్కాపురం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.విచారణ జరిపిన న్యాయమూర్తి సదరుఎస్సై, సీఐపై కేసు నమోదు చేసి.. ఏప్రిల్ 28 న న్యాయస్థానంలో హాజరుకావాలని తాఖీదులు జారీ చేశారు.

case registered against SI and CI
case registered against SI and CI
author img

By

Published : Jan 24, 2023, 5:10 PM IST

Updated : Jan 24, 2023, 5:35 PM IST

Case on Markapuram CI and SI: పోలీస్ స్టేషన్​కు వెళ్లిన ఓ యువకుడిని ఎస్సై విచక్షణారహితంగా దాడి చేయగా.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సీఐ రాజీ చేసుకోకుంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు మార్కాపురం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో సదరు ఎస్సై, సీఐపై న్యాయమూర్తి కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన పెరికె పవన్ కుమార్ దంపతులకు కుటుంబ సమస్యలు వచ్చాయి. దీంతో భర్త పవన్ కుమార్​పై భార్య పోలీస్ స్టేషన్​లో పిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగష్టు 23న ఎస్సై శశికుమార్ యువకున్ని స్టేషన్​కు పిలిపించి విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు వైద్యశాలలో చికిత్స పొందాడు. దాడి చేసిన ఎస్సై శశికుమార్​పై చర్యలు తీసుకోవాలని బాధితులు స్టేషన్ బయట అప్పట్లో ధర్నా నిర్వహించారు. దీంతో న్యాయం చేస్తామన్న సీఐ భీమానాయక్ బెదిరిస్తున్నారని పవన్​కుమార్​ కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి పలు సెక్షన్ల కింద ఎస్సై, సీఐపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 28న న్యాయస్థానంలో హాజరుకావాలని అధికారులకు తాఖీదులు జారీ అయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 24, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.