ETV Bharat / state

స్వాబ్​లతో కరోనా ఫలితాలు ఆలస్యం... ఆందోళనలో ప్రజలు - ప్రకాశం జిల్లా దర్శిలో స్వాబ్​తో పరీక్షలు

ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. స్థానికులకు కొవిడ్ పరీక్షల కోసం .. స్వాబ్​లను తీస్తున్నారు. ఈ స్వాబ్​లను పరీక్షించి ఫలితాలు వెల్లడించడంలో పది నుంచి పదిహేను రోజులు ఆలస్యమౌతుందని అధికారులు తెలిపారు.

corona reports are late with swab tests in prakasam district
స్వాబ్​లతో కరోనా ఫలితాలు ఆలస్యం
author img

By

Published : Jul 13, 2020, 10:25 AM IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రజలకు కరోనా నిర్ధరణ పరీక్షల కోసం.. స్వాబ్​లను తీస్తున్నారు. ఈ స్వాబ్​లను పరీక్షించి ఫలితాలు వెల్లడించడంలో పది నుంచి పదిహేను రోజులు ఆలస్యమౌతుందని అధికారులు తెలిపారు.

కరోనా పరీక్షల కోసం స్వాబ్​లు ఇచ్చిన వ్యక్తులకు... 15రోజుల తరువాత పాజిటివ్​గా నిర్ధరణ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ వ్యక్తి తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటున్నారు. వారితో తిరిగిన వారందరూ కంగారు పడుతున్నారు. కొంతమందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యేలోపే మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిణామాలతో... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

దర్శి ప్రాంతంలో జూన్ 20, 25 తెదీల్లో కొంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరించారు. వారితో తిరిగిన వారంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

ఇదీ చదవండి:

మా గ్రామాల్లో కరోనా మృతదేహాలను ఖననం చేయొద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.