ETV Bharat / state

Conflicts in YSRCP: అధికార వైసీపీలో రచ్చకెక్కిన అంతర్గత కలహాలు.. ఇంఛార్జ్​ను తొలగించాలని డిమాండ్​ - varikuti ashok babu kondapi constituency

Conflicts in YSRCP: అధికార వైసీపీలో విబేధాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంఛార్జ్​లకు, వైసీపీ నాయకులకు మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కొండపిలో అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు తనను రాజకీయంగా అవమానిస్తున్నారని అదే పార్టీకి చెందిన మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రావూరి ప్రభావతి ఆరోపించారు.

Conflicts in YSRCP
Conflicts in YSRCP
author img

By

Published : Jun 14, 2023, 11:30 AM IST

Conflicts in YSRCP: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వర్గ విబేధాలు విస్తృతమయ్యాయి. అలాగే ఒకరిపై ఒకరి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. విశాఖ, ఒంగోలు, నెల్లూరు ఇలా ఏదో ఒకచోట నాయకుల మధ్య లొల్లి నడుస్తూనే ఉన్నాయి. నువ్వంటే నువ్వంటూ అంతర్గతంగా దూషించుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కొండపిలో అధికార వైసీపీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి.

వైసీపీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ వరికూటి అశోక్​బాబు తనను రాజకీయంగా అవమానిస్తున్నారని, గిరిజనులను చిన్న చూపు చుస్తున్నారని.. గొడవలు, హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నారని.. అదే పార్టీకి చెందిన మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​ రావూరి ప్రభావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహిస్తూ, తొలి నుంచి పార్టీలో కష్టపడిన వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రావూరి ప్రభావతి ఫిర్యాదులో పేర్కొన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంఛార్జ్​ వరికూటి అశోక్​బాబు తమ గ్రామానికి వచ్చినప్పుడు.. గ్రామ సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని, అప్పటినుంచి తన మీద కక్ష కట్టారని ఆమె పేర్కొంది. గిరిజనులకు రాజకీయాలు ఎందుకు అని అశోక్ బాబు అనుయుడు, సోమరాజుపల్లి సర్పంచ్ యన్నబత్తిన సరోజ కుమారుడు కార్తిక్ తనపై ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శించారని ప్రభవాతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా దుర్భషలాడుతు.. అసభ్య పదజాలంతో దూషించి తనపై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా పలువురు అడ్డుకొని తనను రక్షించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొండపి నియోజకవర్గ మహిళ నాయకులపై దాడులని అరికట్టి హత్య రాజకీయాలని అరికట్టాలని ఆమె కోరారు. ఈ మేరకు తనపై దాడికి ప్రయత్నించి, కులం పేరు చెప్పి దూషించిన అశోక్ బాబు అనుచరులపై సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే స్పందించి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ని తొలగించి న్యాయం చేయాలని కోరారు.

"మా గ్రామంలో ఈ నెల 6వ తారీఖున జరిగిన గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్​ వచ్చారు. మా గ్రామంలో నీటి సమస్య ఉంది. వాటర్​ ప్లాంట్​ నిర్మాణం కోసం అడిగితే 70వేలు ఎవరు ఇస్తారో వాళ్లకే ఆ ప్లాంట్​ ఇస్తా అని చెప్పారు. నా గ్రామానికి సంబంధించిన సమస్యలు అడిగాగని వరికూటి అశోక్​బాబు నన్ను పరుషపదజాలంతో దూషించారు. నీకెందుకు ఈ గ్రామ సమస్యలు అని నాపై అరిశారు. యానాదులు రాజకీయాలకు అవసరం లేదన్నారు. ఈ మండలంలో పార్టీ కాపాడిన వ్యక్తి మీద దాడులు జరిపించారు. ప్రస్తుత ఇంఛార్జ్​ వచ్చినప్పటి నుంచి ఈ ఆరు మండలాల్లో దాడులు, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి జగన్​ ఈ కొండపి నియోజకవర్గానికి న్యాయం చేయాలని, ఇప్పుడు ఉన్న ఇంఛార్జ్​ను తొలగించాలని కోరుకుంటున్నాను."-ప్రభావతి, వైసీపీ నాయకురాలు కొండపి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.