ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దొంగతనం చేసిన కేసు నిందితుడిని ప్రకాశం జిల్లా చినగంజాం పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27న నీలాయిపాలెంలో వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో... ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్ళారు. చోరీని గుర్తించిన అనంతరం బాధితురాలు తూమాటి బేబీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన చినగంజాం పోలీసులు ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన నిందితుడు తెలగతోటి అశోక్‌ను అరెస్ట్ చేశారు. అతడికి కొవిడ్-19 పరిక్ష నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. అశోక్ నుంచి మూడు సవర్ల బంగారు గొలుసు, రూ. 2,700 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు విజయ్ కోసం గాలింపు చేపట్టామని ఇంకొల్లు సీఐ రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి: