జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతోపాటుగా వేరుశనగ చిక్కీలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఈ మేరకు తయారీ చేపట్టారు. అయితే వీటి ప్యాకింగ్‌పై జగనన్న గోరుముద్ద పథకం లోగోతోపాటుగా సీఎం చిత్రాన్ని కూడా ముద్రించడం పలు విమర్శలకు తావిస్తోంది. విద్యార్ధులకు ఇచ్చే తినుబండారాలపై ముఖ్యమంత్రి చిత్రాన్ని ముద్రించడం చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభం కానప్పటికీ విద్యార్థులు ఇంటి వద్దకే వీటిని అందజేయనున్నారు.
ఇవీ చూడండి...
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు...రూ.18 లక్షల చోరీ సొత్తు స్వాధీనం