ప్రకాశం జిల్లా దర్శి, కురిచేడు, తాళ్ళూరు, దొనకొండ, ముండ్లమూరు మండలాల్లో... కందుల కొనుగోలు కేంద్రాలాలలో నిర్వహకులు భారీ అవినీతికే తెరలేపారు. ఈ ఏడాది కంది పంట తక్కువే అయినా... మార్క్ఫెడ్ గోదాం అధికారులతో సమన్వయం కుదుర్చుకుని... నిర్వహకులు నాలుగు సంవత్సరాల డేటాను ఈ సంవత్సరం చూపిస్తున్నారు. ఫలితంగా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కందులు కొనుగోలు చేసి మిగిలిన వాటికోసం పక్క రాష్ట్రం నుంచి తక్కువ ధరకే నాశిరకం కందులను విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రం నిర్వాహకులు కొనుగోళ్లు చేయటం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇదీ చూడండి