ETV Bharat / state

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి మహాప్రభో..!: లబ్ధిదారులు - janasena party news

Big delay in construction of Tidco houses: రాష్ట్రంలోని పేద ప్రజలకు గూడును కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం..'ఎన్టీఆర్ గృహకల్ప' పేరుతో లాక్షలాది టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. దాదాపు 80 శాతం పనులను కూడా పూర్తి చేసింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని అంతా భావించారు. కానీ, 2019లో ప్రభుత్వం మారడం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. గత నాలుగేళ్లుగా పేదవాడి సొంతంటి కల నెరవేరుతుందని ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు నిరాశలవుతున్నాయి. ఇప్పటికైనా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయండి మహాప్రభో అని వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

TIDCO
TIDCO
author img

By

Published : Mar 22, 2023, 10:27 PM IST

Updated : Mar 22, 2023, 10:41 PM IST

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి మహాప్రభో..!

Big delay in construction of Tidco houses: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఆశలు రోజురోజుకి నిరాశలవుతున్నాయి. ఓవైపు కూలీ పనులు దొరకక, పిల్లలను చదివించుకోలేక నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు ఇంటి అద్దెను చెల్లించలేక అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరగా టిడ్కో ఇళ్లను నిర్మించి.. లబ్ధిదారులకు అందిస్తే.. వచ్చిన కూలీ డబ్బులతో తమ కుటుంబాలను పోషించుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. గత ప్రభుత్వ హయంలో 80 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి..పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలని..ప్రకాశం జిల్లా కనిగిరి లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో గత నాలుగు సంవత్సరాలుగా తీవ్ర జాప్యం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నేటిదాకా టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను నిలిపివేయడంతో గృహ సముదాయాల వద్ద భారీగా పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు పెరిగి అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఏళ్లుగా టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రకాశం జిల్లా కనిగిరిలోని లబ్ధిదారులంతా.. అద్దె గదుల్లో మూలుగుతున్నారు.. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణంతో లక్షల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. 2019లో ప్రభుత్వం మారడం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో తెదేపా హయాంలో 912 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పనులు కూడా దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఇళ్ల నిర్మాణం మూలన పడింది. అధికారులెవరూ పట్టించుకోకపోవండంతో గృహ సముదాయం అధ్వాన్నంగా తయారైంది. పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు పెరిగి అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. నిర్మాణానికి తెచ్చిన సామాగ్రి, గదులు, గోడలు చెదలు పట్టి పాడైపోతున్నాయి.

నాకు అపార్ట్‌మెంట్‌లో ఇల్లు వచ్చి నాలుగేళ్లు అయ్యింది. నాలుగేళ్ల నుంచి ఇది చేస్తాం, అది చేస్తామంటూ ఈ గవర్నమెంట్ కాలయాపన చేస్తోంది. మేము ఉండేది అద్దె ఇంటిలో..పనికిపోతే రోజుకు రూ. 300 వస్తాయి. దీంతో నా భార్య, పిల్లలను సాదుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా, వచ్చే రూ.300ల్లో ఏదైనా కొనాలన్నా, తినాలన్నా చాలా భయంగా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి.. ఆ టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాను. -మహబూబ్ బాషా, లబ్ధిదారుడు, కనిగిరి

సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని.. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తవగా... కేటాయింపు విషయంలో మాత్రం ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా వేసి లబ్ధిదారుల ఆశలపై నీళ్లు జల్లుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. టిడ్కో గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి... తమ సొంతింటి కల నెరవేర్చాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 22, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.