స్థానిక ఎన్నికలు వాయిదా పడటంపై.. ప్రకాశం జిల్లాలో సమీకరించిన బ్యాలెట్ బాక్స్‌లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో జరగవలసిన స్థానిక ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించేందుకు వీటిని తెలంగాణ నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తీసుకువచ్చారు. అనుకున్న సమయానికి ఎన్నికలు జరగకపోవడం వల్ల వాటిని పాత జెడ్పీ కార్యాలయంలో భద్ర పరిచారు.
ప్రస్తుతం తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రతిపాదన రావడం వల్ల... అక్కడి అధికారులు తమ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు ఏర్పాట్లుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా తమ రాష్ట్రానికి చెందిన 841 బ్యాలెట్ బాక్స్‌లు తిప్పి పంపించాలని ప్రకాశం జిల్లా పరిషత్ అధికారులను కోరగా.. ఆర్టీసీ మెటీరియల్ సర్వీస్ వాహనంలో వీటిని తరలిస్తున్నారు. ఈ బ్యాలెట్ బాక్స్‌లను జెడ్పీ సీఈవో టి. కైలాస గిరీశ్వర్ పర్యవేక్షణలో వెహికల్స్‌ను సీలు వేసిన తరలించారు.
ఇదీ చదవండి: