ETV Bharat / state

బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్ - ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాజా వార్తలు

గుట్టు చప్పుడు కాకుండా బెల్టు షాపు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి చెప్పారు.

Arrest of two persons
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
author img

By

Published : May 13, 2021, 11:31 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, కొత్తపల్లి గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వందకు పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు.

పట్టుబడ్డ నిందితులలో ఒకరు మహిళ కూడా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. అక్రమ మద్యం తరలింపు, బెల్ట్ షాపుల నిర్వహణ, నాటుసారా అమ్మకాలు ఎవరైన చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 9121102188 నంబర్​కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై రవీంద్రారెడ్డి తెలియజేశారు.

ఇదీ చదవండి:

3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో... ఆక్సిజన్ పడకల తగ్గింపు?

డౌన్​లోడ్​లో జియో జోరు​- అప్​లోడ్​లో వొడాఫోన్ టాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.