ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా బాధితులు పెరుగుతుండటంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కోవిడ్-19 ట్రూనాట్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షలు నిర్వహించిన కొద్దిసేపటికే ఫలితాలు వెల్లడించేలా అధికారాలు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే పరికరాలను అమర్చారు. ఇకపై ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. దర్శి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సురేష్ కుమార్ కోరారు.
ఇవీ చూడండి...