ఒంగోలులో ఏపీటీఎఫ్ నాయకుల ధర్నా - aptf leaders protest in ongole
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని .. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయినా.. సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలేదని మండిపడ్డారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు వర్తింపచేయడంతో .. ప్రభుత్వ పాఠశాలకు తీవ్ర నష్టం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీటీఎఫ్ నాయకుల ధర్నా