ETV Bharat / state

ఒంగోలులో అదనపు కొవిడ్ కేర్ సెంటర్లు, పడకల ఏర్పాటుకు చర్యలు - ఒంగోలులో అదనపు కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రకాశం జిల్లాల్లో పడకల సంఖ్య పెంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించుకున్న వాటిని.. ప్రస్తుతం కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చి వైరస్ బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

additional covid centers in ongole
ఒంగోలులో అదనపు కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు
author img

By

Published : May 2, 2021, 5:10 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో పడకలు చాలకపోవడంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పక్క జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో బాధితులు ఇక్కడకు వైద్యం కోసం వస్తుండటంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీన్ని నివారించేందుకు ప్రత్యమ్నాయ మార్గాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.

కొవిడ్ కేర్ సెంటర్​గా ట్రిపుల్ ఐటీ:

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు 15 కొవిడ్ కేంద్రాల్లో రోగులకు సేవలందింస్తున్నారు. ఆయా వైద్యశాలల్లో దాదాపు రెండువేల పడకలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 6 నుంచి 7 వందల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొందరు హోమ్‌ ఐసొలేషన్​లో ఉన్నా.. ఆక్సిజన్‌ అవసరమైన, వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న, ఇంటివద్ద సదుపాయం లేని వారు సర్వజన ఆసుపత్రిలో చేరేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో అదనపు పడకల ఏర్పాటుకు జిల్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒంగోలు గిరిజన్‌ భవన్‌లో ఇప్పటికే దాదాపు 100 పడకలు సిద్ధం చేశారు. స్థానిక ట్రిపుల్‌ ఐటీని కొవిడ్‌ కేర్‌ సెంటర్​గా మారుస్తున్నారు. ఈ చర్యలతో దాదాపు 400 పడకలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు, మంచాలు, ఫ్యాన్​లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి:

ట్రయాజనింగ్ విధానం అమలు:

ఎండ్లూరు డొంక సమీపంలోని మహిళా ప్రాంగణం, మద్దిపాడు, గిద్దలూరుల్లోనూ అధికారులు కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌ అందకపోవడం, అత్యవసర సేవలు అవసరమైన వారికి తక్షణ సాయం అందిచడం కోసం ప్రతిచోటా రెండు 104, 108 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారు. స్వల్ప అస్వస్థత ఉన్నవారు ఆసుపత్రిల్లో చేరి మంచాలు వినియోగించుకోవడం వల్ల.. అత్యంత అవసరమైన రోగులకు ఇబ్బంది కలుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. రోగి ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు బట్టి గ్రేడింగ్‌ చేసే ట్రయాజనింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. సాధారణ లక్షణాలు ఉంటే కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు, తీవ్ర ఆరోగ్య సమస్యలుంటే ఒంగోలు సర్వజన ఆసుపత్రికి తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల జీజీహెచ్‌కు కొంత ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. పడకల సంఖ్య ఆధారంగా కొవిడ్ కేర్‌ కేంద్రాలకు వైద్య బృందాలను కేటాయిస్తున్నారు. 100 పడకలకు ఆరుగురు వైద్యాధికారులు, ఆరుగురు ఏఎన్ఎమ్​లను నియమిస్తున్నారు. 5 నుంచి 10 వరకు ఆక్సిజన్‌ కాన్సన్​ట్రేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పొరుగు జిల్లాలతో పోలిస్తే ప్రకాశంలో కొంత తక్కువ కేసులు సమోదవుతున్నాయి.

ఇదీ చదవండి:

కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.