ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నారపరెడ్డిపల్లి గ్రామం దగ్గర కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా.. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఏడాది వయసున్న పసికందు.. ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది.
కారు పూజ కోసం వెళుతుండగా..
కనిగిరికి చెందిన కుందూరు రామిరెడ్డి కుటుంబం కొత్త కారు కొనుగోలు చేసింది. కారుకు పూజ నిమిత్తం పోరుమామిళ్ల దగ్గర ఓ గుడికి ఐదుగురు కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు. మార్గంమధ్యలో మండలంలోని నారపరెడ్డిపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే ఊహించని దారుణం జరిగింది.
వేగాన్ని నియంత్రించలేక..
నారపరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో.. రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద సూచిక బోర్డును కారు ఢీకొంది. దీంతో.. కారు పల్టీలు కొడుతూ సుమారు 50 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ.. కారు డోరు సైతం తెరుచుకోవడంతో.. కళ్యాణి(32) రోడ్డుపై జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది.
వాహనంలో ఇరుక్కుపోయి కొనఊపిరితో ఉన్న మృతురాలి కళ్యాణి తమ్ముడు చైతన్య(20)ను సమీప వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామిరెడ్డి(65)ని మెరుగైన వైద్యం కొరకు ఒంగోలు తరలించగా.. మార్గంమధ్యలో మృతి చెందాడు. కళ్యాణి తల్లి, ఏడాది వయసున్న బిడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఇదీ చదవండి: