ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం దైవాలరావూరు గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మద్దినేని గోపి అనే వ్యక్తి నుంచి 480 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన 90 మి.లీ మద్యం ప్యాకెట్లను గుర్తించినట్లు ఎస్సై ఖాదర్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: