ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లిలోని భైరవకోన జలపాతం వద్ద కొలనులో పడి గోరంట్ల సుబ్బనాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తిక సోమవారం సందర్బంగా లింగసముద్రం మండలం వీఆర్ కోటకు చెందిన సుబ్బనాయుడు తన స్నేహితులతో కలిసి ఈ జలపాతానికి వెళ్లాడు. తిరిగి రాకపోవడం వల్ల మృతుడి సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
జలపాతంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడని పోలీసుల విచారణలో అతని స్నేహితులు తెలిపారు. ఈత రాకపోవడం, మూగ, చెవుడు ఉన్నందున అతను మునిగిన విషయాన్ని గమనించలేదని పోలీసులకు వివరించారు. ఇవాళ ఉదయం జలపాతం వద్ద కొలనును శుభ్రం చేస్తుండగా మృతదేహం బయటపడిట్లు కాపలాదారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అది సుబ్బనాయుడు మృతదేహంగా గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: