ప్రకాశం జిల్లా కనిగిరిలో 9 నెలల బాలుడి అదృశ్యం కలకలం రేపింది. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన జయంపు గణేష్, దుర్గలకు ఇద్దరు కుమారులు. గణేష్ బేల్దారి పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాడు. భార్య దుర్గ తన ఇద్దరు పిల్లలతో కలిసి కాశిరెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది.
రోజూ మాదిరిగానే దుర్గ పక్కింటి ప్రేమలత మరి కొందరు మహిళలతో కలిసి ఇంటి సమీపంలో కాలక్షేపం కోసం గుండీలాట ఆడుకునే సమయంలో దుర్గ ఒడిలోనే తన కుమారుడు వంశీ (9 నెలలు) నిద్ర పోయాడు. దీంతో పక్కింటి ప్రేమలతకు తన కుమారుడినిచ్చి తన ఇంట్లో పడుకో పెట్టమని దుర్గ కోరింది. అందుకు సరే అన్న ప్రేమలత బాలుడిని తీసుకొని దుర్గ ఇంటి వైపు వెళ్లింది.
కొంత సేపటికి వెళ్లి చూడగా..
అనంతరం కొద్దిసేపటి తర్వాత దుర్గ తన ఇంటికి వెళ్లి చూడగా తన కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ఆందోళన చెంది.. చుట్టుపక్కల విచారించింది. చివరగా ప్రేమలతను అడగ్గా ప్రేమ లత తనకు తెలియదని, బిడ్డను ఇంట్లోనే (దుర్గ ఇంట్లో) పడుకో పెట్టానని సమాధానం ఇచ్చింది. దీంతో ఆందోళనకు గురైన దుర్గ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని అనుమానితులను, ప్రేమలతను అదుపులోకి తీసుకొని విచారణ వేగవంతం చేశారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి.. అంతటితో ఆగకుండా..