ETV Bharat / state

వాలంటీర్లంతా.. వైకాపాకు సమాచారాన్ని చేరవేసే సైనికులు: మంత్రి అంబటి - Nellore District Plenary Meeting

YSRCP District Plenary Meeting at Nellore: వాలంటీర్లే వైకాపా సైనికులని మంత్రి అంబటి కుండబద్ధలు కొట్టారు. నాయకులు సూచించిన వాళ్లనే వాలంటీర్లుగా ఎంపిక చేశామని నిర్మొహమాటంగా చెప్పేశారు. నెల్లూరు జిల్లా వైకాపా ప్లీనరీలో పాల్గొన్న అంబటి.. వైకాపాను వ్యతిరేకించే వాలంటీర్లను తీసేసి కొత్త వాళ్లను పెట్టుకుంటామని స్పష్టంచేశారు.

minister Ambati Rambabu
minister Ambati Rambabu
author img

By

Published : Jun 30, 2022, 7:06 PM IST

Minister Ambati Rambabu Comments on volunteers: 'వాలంటీర్లంతా.. వైకాపా కార్యకర్తలు, పార్టీకి సమాచారం చేరవేసే సైనికులు' అంటూ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైకాపా జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడారు. 'వాలంటీర్లు ఎవరు ?, వాళ్లను ఎవరు పెట్టారు అంటే.. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు. గ్రామాల్లో మీరు చెబితేనే పెట్టాం. అవసరమైతే తీసేస్తాం. తప్పు చేస్తే చెప్పండి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం. మళ్లీ కొత్తవాళ్లను వేసేస్తాం. వాలంటీర్లు అందరూ కూడా మీరు చెబితేనే వచ్చినవాళ్లు. వారంతా వైకాపాకు కార్యకర్తలు. ప్రతి విషయాన్ని ఇంటింటికి చేరవేసే సైనికులు. మీ నాయకత్వంలో గ్రామాల్లో వాళ్లను గ్రిప్​లో పెట్టుకుని ముందుకెళ్లండి' అంటూ సమావేశంలో మంత్రి అంబటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.